కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా కంఠంరాజుకొండూరు గ్రామంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని భగవంతుడు కాపాడాలనే ఆకాంక్షతో.. ఈ నెల 24 నుంచి 27 వరకు తీర్థయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కళాకారులకు కొంత సాయం చేయాలనే.. ఉద్దేశంతో నెలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: