గుంటూరు జీజీహెచ్ కాన్పుల వార్డులో పాము కలకలం రేపింది. రాత్రి 8.30 గంటల సమయంలో కాన్పులో వార్డులో పాము ప్రవేశించడంతో గర్భిణులు, బాలింతలు వారి సహాయకులు, వైద్యు సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆర్.ఎం.ఓ సతీష్ పారిశుధ్య కార్మికులను పిలించి జల్లెడపట్టించారు. ఎంతసేపటికి పాము కనిపించకపోవడంతో... వెంటనే అక్కడ క్రిమి సంహారక మందు చల్లించారు. గత నాలుగు రోజులు క్రితం ఎలుకుల కోసం ఏర్పాటు చేసిన బోనులో పాము పడిందని.. దానిని సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించడంతో ఈరోజు మరోసారి పాము వచ్చిందని రోగులు చెపుతున్నారు.
గతంలో జీజీహెచ్ లో ఎలుక కరిచి ఓ చిన్నారి మృతి చెందాడు. ఇప్పుడు పాములు తిరుగుతుండంతో బాలింతలు, గర్భిణులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు . ఇప్పటికైన అధికారులు స్పదించి తగిన చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: TOLLYWOOD DRUGS CASE: మనీలాండరింగ్ కేసులో మరికొందరికి నోటీసులు..