ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. భాజపా విజ్ఞప్తిని నిరాకరించిన హైకోర్టు

MLAs Poaching Case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​కు ఇచ్చిన సిట్​ నోటీసులను రద్దు చేయాలని బీజేపీ హైకోర్టులో వేసిన పిటిషన్​ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే సిట్​ విచారణకు సంతోష్ సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.

high court
హైకోర్టు
author img

By

Published : Nov 19, 2022, 8:33 PM IST

MLAs Poaching Case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​కు ఇచ్చిన సిట్ నోటీసులను రద్దు చేయాలన్న.. బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. బీఎల్ సంతోష్ పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలిచ్చే వరకు సంతోష్​ను మాత్రం అరెస్ట్ చేయొద్దని హైకోర్టు సిట్ అధికారులను ఆదేశించింది. దిల్లీ పోలీసులు సైతం సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు తెలిపింది. రాజకీయ కక్ష్యల కారణంగానే బీఎల్ సంతోష్​కు సిట్ అధికారులు నోటీసులిచ్చారని.. 41ఏ సీఆర్పీసీ ఇవ్వడం సరైంది కాదని భాజపా నాయకుడు ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్​ను హైకోర్టు అత్యవసరంగా విచారించింది.

జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి ఉన్న సంతోష్​ను విచారణ పేరుతో నోటీసులివ్వడంతో పాటు అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు చూస్తున్నారని.. రాజకీయ కారణాలతో చేపడుతున్న ఈ చర్యలు మంచివి కావని పిటిషనర్ తరఫు న్యాయవాది వైద్యనాథన్ కోర్టు దృష్టికి తీసుకెల్లారు. ఈ కేసుకు సంతోష్​కు ఎలాంటి సంబంధం లేదని.. నిందితులుగా ఉన్న వాళ్లకు మాత్రమే 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలన్న కర్నాటక హైకోర్టు తీర్పును వైద్యనాథన్ ప్రస్తావించారు. నిందితుడు, లేదా అనుమానితుడికి 41ఏ నోటీసులివ్వొచ్చని ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాంచంద్రభారతి, బీఎల్ సంతోష్​కు వాట్సాప్ సందేశాలు పంపాడని.. వాటిని నివృత్తి చేసుకునేందుకే నోటీసులిచ్చామని పోలీసుల తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రాంచందర్ రావు హైకోర్టుకు తెలిపారు.

కీలకమైన ఈ దర్యాప్తును అడ్డుకోవాలని భాజపా చూస్తోందని.. హైకోర్టు సీజే ధర్మాసనం సైతం సిట్​కు అధికారాలు కల్పించిన విషయాన్ని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. దిల్లీ పోలీసులు సైతం సిట్​కు సహకరించడం లేదని.. ఇదీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని అదనపు అడ్వకేట్ జనరల్ అన్నారు. బీఎల్ సంతోష్​కు ఇప్పటికే వాట్సాప్​లో నోటీసులు పంపించామని నేరుగా వెళ్లి నోటీసులిచ్చేందుకు ప్రయత్నించగా.. దిల్లీ పోలీసులు సహకరించలేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సిట్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బీఎల్ సంతోష్ నేరుగా నోటీసులు ఇచ్చేందుకు దిల్లీ పోలీసులు సిట్ అధికారులకు సహకరించాలని.. అంతే కాకుండా సంతోష్ సైతం విచారణకు సహకరించాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.