అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష రికార్డు సృష్టించబోతుండటం..ఆనందంగా ఉందని ఆమె తాతయ్య రాగయ్య అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులో ఉంటున్నారు. వర్జిన్ గెలాక్టిక్ అనే ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ నుంచి శిరీష అంతరిక్షంలోకి వెళ్లనుందని తెలిపారు. రాగయ్య కుమారుడు మురళీధర్, అనురాధ దంపతుల రెండో కుమార్తె శిరీష. చిన్నతనం నుంచే శిరీషకు ధైర్యం ఎక్కువని, లక్ష్యం సాధించి క్షేమంగా తిరిగొస్తుందని రాగయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.
శిరీష తండ్రి మురళీధర్ ప్లాంట్ పెథాలజీలో పీహెచ్డీ చేసి 1989లో అమెరికా వెళ్లారన్నారు. అక్కడే అమెరికా ప్రభుత్వం తరపున పనిచేస్తున్నట్లు రాగయ్య వెల్లడించారు. తల్లి అనురాధ కూడా అక్కడే ఉద్యోగంలో చేస్తూ.. వాషింగ్టన్ డీసీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి
space tour: తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ