ETV Bharat / state

వైకాపాలో 2 వర్గాల మధ్య ఘర్షణ... ఏడుగురికి గాయాలు - local body elections in vatticherukuru mandal kurnutala

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతుల గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్లు వేయడానికి వెళుతున్న వైకాపా రెబల్ వర్గాన్ని.. అదే పార్టీకి చెందిన మరొక వర్గం అడ్డుకుని దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. బాధితులను గుంటూరు జీజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు... ఏడు మందికి గాయాలు

author img

By

Published : Feb 10, 2021, 5:28 PM IST

గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైకాపాలో వర్గపోరు భగ్గుమంది. వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో.... పార్టీలోని 2 వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇరువర్గాల పరస్పర దాడిలో... ఏడుగురికి గాయాలయ్యాయి. రెండు వర్గాలు గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని భావించారు.

నామినేషన్ వేసేందుకు వెళ్తున్న కృష్ణారావు వర్గాన్ని గోపాలరావు వర్గం అడ్డుకుంది. వారిపై కర్రలతో దాడి చేశారు. అవతలి వర్గం కూడా ప్రతిఘటించటంతో ఉద్రికత నెలకొంది. పరస్పరం జరిగిన ఘర్షణలో గాయపడ్డవారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాడులకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సంరక్షణ మధ్య కృష్ణారావు నామినేషన్ వేసేందుకు వెళ్లారు.

ఇవీ చదవండి:

గుంటూరు జిల్లా పంచాయతీల ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.