గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాలు ఆగడం లేదు. ప్రతిరోజు జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిల్వలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం శనివారం యడ్లపాడు మండలంలో తనిఖీలు చేపట్టింది.
తిమ్మాపురం గ్రామంలో రామయ్య అనే వ్యక్తికి చెందిన పొగాకు బ్యారన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బృందంలో పౌరసరఫరాల, తూనికలు కొలతల అధికారులు ఓంకార్, మల్లేశ్వరరావు, అల్లు రొయ్య పాల్గొన్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: