గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి తరలిస్తున్న రూ.6 లక్షల విలువైన 4,236 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు నుంచి కృష్ణా నదిలో పడవల ద్వారా తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పక్కా సమాచారంతోనే పోలీసులు అక్రమ మద్యం రవాణాదారుల ఆట కట్టించారు. కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అచ్చంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి రాష్ట్రంలో పులులు తిరిగే ప్రాంతం పెరిగింది