గుంటూరు జిల్లా నగరం మండలంలో అక్రమంగా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 140 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని.. రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశామని చెప్పారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు నగరం, నిజాంపట్నం మండలాల ఎస్ఈబీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
ధూలిపూడి సమీపంలోని దుకాణంలో అమ్మేందుకు.. మద్యాన్ని తీసుకువస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఎస్ఈబీ అధికారులు చెప్పారు. మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టుతో పాటు కొనుగోలు చేస్తున్న మరో మహిళను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అక్రమ మద్యం తరలింపు, నాటు సారా తయారీ, అమ్మకాలు వంటి చట్టవ్యతిరేక పనులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. అనధికారిక మద్యం అమ్మకాలపై తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: కరోనాతో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మృతి