గుంటూరులోని పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మెడకు ఉరి తాడు వేసుకుని నిరసన చేపట్టారు. లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికుల పాదాలకు పాలాభిషేకం చేశారు. కరోనా సమయంలో నియమించిన కార్మికులను యధావిథిగా కొనసాగించాలని మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాలరావు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న హెల్త్ బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల పిల్లలకు జగనన్న అమ్మఒడి వర్తింపచేయాలని కోరారు. న్యాయపరమైన తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ఆస్తి పన్ను పెంపు వల్ల నగరవాసులకు తీవ్ర నష్టం'