గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టారు. గత ఆదివారం సచివాలయంలోని ఐదో బ్లాక్లో ఓ పారిశుధ్య కార్మికుడు రాజేంద్రప్రసాద్ మృతిచెందారు. ఈ నేపథ్యంలో.. ఆయన కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు.
విధులు బహిష్కరించి రోడ్డు పక్కనే కూర్చుని నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు వారితో చర్చలు జరిపినా.. ఫలితం లేకపోయింది. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించేవరకూ కదలబోమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Mahapadayathra: మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం