గుంటూరు జిల్లా తెనాలిలో దుర్గాప్రసాద్ అనే పారిశుద్ధ్య కార్మికుడు అకస్మాత్తుగా మృతిచెందాడు. కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉండగా దుర్గాప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. దుర్గాప్రసాద్ 13 రోజుల క్రితం తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు.
రెండు రోజులుగా అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పడిపోవటంతో అక్కడి సిబ్బంది మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుర్గాప్రసాద్ మృతికి కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వికటించడం వల్ల దుర్గాప్రసాద్ మరణించారేమోనని తోటి సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
దుర్గగుడి అవకతవకలపై ప్రభుత్వానికి అనిశా నివేదిక.. ఈవో గురించి ఏం చెప్పారంటే?