సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతీ ప్రభుత్వ సంస్థ సమాచారం, రికార్డులు, పత్రాలు, మెమోలు, పత్రికా ప్రకటనలు సర్క్యులర్లు, నివేదికలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చుని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు అన్నారు. గుంటూరు బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర సమాచార హక్కు సొసైటీ జిల్లా నూతన కమిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులకు ఐడీ కార్డులు అందించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించిన రోజే వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ చట్టం ద్వారా, ప్రాథమిక సమాచారాన్ని ఏ అధికారి నుంచి అయినా తెలుసుకోవచ్చని సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షైక్ సైదా వెల్లడించారు.
ఇవి చదవండి...తుపానులకు పేర్లు ఎప్పటినుంచి పెడుతున్నారు?