ETV Bharat / state

ఉద్యోగుల చర్చల్లో ముందడుగు.. కొన్ని అంశాలపై క్లారిటీ - బండి శ్రీనివాసరావు

Sajjala on Employees Pending Bills: ఈ నెలాఖరులోగా పెండింగ్​లో ఉన్న రూ.3 వేల కోట్ల బకాయిలను చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈరోజు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రులు.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం రెండు మెట్లు దిగే చర్చలు జరుపుతుందని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 7, 2023, 9:19 PM IST

Updated : Mar 7, 2023, 10:15 PM IST

మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగులకు పెండింగ్​లో ఉన్న రూ.3 వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఈమేరకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిందని.. అందుకే ఉద్యోగులకు చెల్లించలేకపోయామని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యలపై రెండు మెట్లు దిగే చర్చలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యోగులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటుందన్నారు. చిన్న చిన్న సమస్యల్ని ఉద్యోగులు- ప్రభుత్వం కలిసి పరిష్కరించుకుంటాయని స్పష్టం చేశారు. ఇవాళ నిర్వహించిన చర్చల్లో కొన్ని అంశాలు పరిష్కారం అయ్యాయని.. మరికొన్నిటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం మంత్రులు

ఈనెలాఖరులోగా చెల్లింపులు: సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు చరిపినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని సీఎం చెప్పారని మంత్రి వెల్లడించారు. వారి పెండింగ్ అంశాలు తెలుసుకునేందుకు ఉద్యోగ సంఘాలతో భేటీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. పీఎఫ్ పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలలోనే క్లియర్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడిచారు. శాశ్వత విత్‌డ్రా, తాత్కాలిక పీఎఫ్ రుణాల బిల్లులన్నీ చెల్లించనున్నట్లు మంత్రి సురేశ్‌ అన్నారు. మెడికల్, ఈహెచ్ఎస్ బిల్లులన్నీ ఈ నెలలోనే బేషరతుగా చెల్లిస్తామన్నారు. టీఏ, జీఎల్ఐ బిల్లులనూ ఈ నెలలోనే చెల్లించాలని నిర్ణయం తిసుకున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాలు తమ దృష్టికి తెచ్చిన అంశాలపై సంతృప్తి కలిగేలా నిర్ణయం ఉంటుందన్నారు. ఇకపై మంత్రుల కమిటీ తరచుగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తుందని మంత్రి సురేశ్‌ వెల్లడించారు.

ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తాం: మంత్రుల కమిటీతో చర్చల అనంతరం ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. తమ ఉద్యమ కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుందని అన్నారు. త్వరలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించి.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని బొప్పరాజు పేర్కొన్నారు. పెండింగ్ డీఏలపై కసరత్తు చేయలేదని మంత్రుల కమిటీ తెలిపిందని వెల్లడించారు. పెండింగ్ డీఏ బకాయిలే ఎక్కువగా ఉంటాయని బొప్పరాజు వెల్లడించారు. రూ. 3007 కోట్లను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని చెప్పినట్లు బొప్పరాజు పేర్కొన్నారు.

నవంబర్ నెలాఖరులోగా మరో రూ. 1800 కోట్లు చెల్లిస్తామని మంత్రుల కమిటీ చెప్పిందని వెల్లడించారు. పెండింగ్ డీఏపై చర్చించి చెబుతామన్నట్లు వెల్లడిచారు. పీఆర్సీ, అరియర్స్ విషయాన్ని కూడా చర్చించి చెబుతామన్నారని బొప్పరాజు పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు గురించిన స్పష్టమైన హామీ ఇవ్వలేదని బొప్పరాజు వెల్లడించారు. మార్చి 2022లోగా సీపీఎస్ అంశంపై స్పష్టత ఇస్తామన్నారని గుర్తుకు చేసిన బొప్పరాజు.. 2023 మార్చి వచ్చినా స్పష్టత రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల వాటాను తిరిగి చెల్లిస్తామని మంత్రుల కమిటీ హామీనిచ్చారని బొప్పరాజు వెల్లడించారు.

2 విడతల్లో డీఏ బకాయిలు: పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింనట్లు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. డీఏ బకాయిలను 2 క్వార్టర్లలో పరిష్కరిస్తామని హామీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామన్నారని బండి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 7, 2023, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.