ETV Bharat / state

శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు - శాప్‌ ఎండీ బదిలీ

SAAP MD Prabhakar Reddy Transferred: శాప్ డైరెక్టర్లు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్షవర్దన్​కు శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

SAAP MD Prabhakar Reddy
శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డి
author img

By

Published : Feb 8, 2023, 11:43 AM IST

SAAP MD Prabhakar Reddy Transferred: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ-శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్షవర్దన్‌కు శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తున్నారని.. క్రీడాకారుల కోటాలో అనర్హులకు గ్రూపు-1 ఉద్యోగాలు ఇప్పించారంటూ.. ముగ్గురు శాప్‌ డైరక్టర్లు మీడియా ముందుకొచ్చి బహిరంగ ఆరోపణలు చేశారు. క్రీడా పరికరాలు అధిక ధరలకు కొనుగోళ్ల చేసి నష్టం చేకూర్చారని.. మండిపడ్డారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డిని పదవి నుంచి తప్పించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.