గుంటూరు జిల్లా మాచర్ల అర్బన్, గ్రామీణ పోలీస్ స్టేషన్, నాగార్జునసాగర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాగర్ చెక్ పోస్ట్, దాచేపల్లి వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. చెక్ పోస్ట్‌లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించబోమని, గతంలో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. వేరే రాష్టానికి చెందిన వారు ఆంధ్రలోకి రావటానికి ఈ పాస్‌లు తప్పనిసరన్నారు. తెలంగాణ నుంచి వచ్చేవారిని టెస్ట్ చేసి శ్యాంపిల్స్ తీసి పంపిస్తున్నామని వివరించారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఇదీ చదవండి రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడు.. పోలీసుల భారీ బందోబస్తు