లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్న వేళ గుంటూరు నగరంలో ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. ఎక్కువ కేసులు నగరంలోనే వెలుగుచూశాయి. ఫలితంగా.. ఉదయం 9 గంటల తర్వాత ఎవరినీ రోడ్లపైకి రానివ్వడం లేదు.
నిబంధనలు ఉల్లఘించి బయటికి వస్తే... కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు వేల కేసులు నమోదు చేశారు. అత్యవసర సర్వీసులకు చెందిన వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. రహదారులపై పోలీసుల తనిఖీలు, రెడ్ జోన్లలో నగరపాలక సంస్థ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు.
ఇదీ చదవండి: