రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేస్తున్న పోరాటం 300 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలను చేయాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. దీనిపై గుంటూరులోని కొత్తమల్లయ్యలింగ భవన్‌లో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
రాజధాని ప్రాంతంలో ఇంత ఉద్యమం జరగడం అభినందనీయమని రామకృష్ణ అన్నారు. ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నిందని, రైతులను అన్యాయంగా జైళ్ళలో పెట్టి వేధించారని విమర్శించారు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి సీఎం కావడం వల్లే సమస్యను గుర్తించలేకపోతున్నారని.. ఇప్పటికైనా జగన్ విజ్ఞతతో ఆలోచించి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటన చేయాలన్నారు.
ఈ నెల 12వ తేదీన అమరావతి కోసం 13 జిల్లాల ప్రజలు నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో భూదందా కోసమే సీఎం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని జనసేన పార్లమెంట్ ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారనే జగన్ దానిని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి..
వైకాపా ప్రభుత్వం మమ్మల్ని రోడ్డుపాలు చేసింది: అమరావతి రైతులు