వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తిమ్మాపురంలో ఓ ప్రమాదం జరిగింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది.
విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై..
విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనకొండ గ్రామం వద్ద తెల్లవారుజామున సుబాబుల్ లారీని వెనక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. సిమెంట్ లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ క్లీనర్‌ను బయటికి తీశారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
గుంటూరు జిల్లాలో..
యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం 16 నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. బేతపూడి గ్రామానికి చెందిన నాయిని పోలిరెడ్డి (47) వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రకాశం జిల్లా కరవదిలో ఉంటున్నాడు. ట్రాక్టర్ మరమ్మతు పనులు చేయించుకునేందుకు విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా తిమ్మాపురం వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో పోలిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న మరో డ్రైవర్ రాఘవరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: