ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు మృతి - guntur latest news

road-accident-in-guntur-district
గుంటూరు జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు మృతి
author img

By

Published : Oct 16, 2020, 6:41 AM IST

Updated : Oct 16, 2020, 8:22 AM IST

06:40 October 16

రొంపిచర్ల వద్ద కారు ప్రమాదం... నలుగురు మృతి

రొంపిచర్ల వద్ద కారు ప్రమాదం

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో కారు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. అద్దంకి - నార్కట్ పల్లి రహదారిలోని తంగేడు మల్లి మేజర్​లో కారు బోల్తా పడి నలుగురు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు.

తెలంగాణా నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న కారు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కాల్వలోకి బోల్తాకొట్టింది. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నలుగురిలో ఇద్దరు తెలంగాణ, మరో ఇద్దరు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బీరు గౌడ్, అతని కుమారుడు బాలాజీ మృతి చెందారు. మిగతా ఇద్దరు యూపీ వాళ్లు.  

కారు డ్రైవర్​, యజమాని మాధవ్​ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. మాధవ్​కు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. ఈయన ప్రకాశం జిల్లా పామూరు మండలం రాయపట్నం వాసిగా తెలిపాడు. ఇళ్లకు రంగులు వేయించేందుకు కూలీలను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

ఇదీ చదవండి: విజయవాడలో ఘాతుకం.. యువతిని చంపిన ప్రేమోన్మాది

Last Updated : Oct 16, 2020, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.