గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా.. వీరిలో ఒకరు మృతి చెందారు. చుండూరు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు నారాకొడూర శివారు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, రత్నకుమారి, ఉపేంద్ర, వీరారెడ్డి, వాణి, జ్యోతిలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో విజయవాడకు చెందిన శ్రీనివాసరావు(52) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఎస్సై కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :