ETV Bharat / state

రెస్టారెంట్ల​ నుండి దూసుకొస్తున్న వాహనాలు

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అన్నట్లుగా ప్రతి ఒక్కరూ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొత్తగా రెస్టారెంట్లు, కాఫీ షాపులు ఏర్పాటు చేసేవాళ్లు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త పోకడలు అవలంబిస్తున్నారు. పసందైన వంటకాలే కాదు.. భిన్నంగా ఆలోచిస్తూ రెస్టారెంట్లు, పుడ్​కోర్టులను తీర్చిదిద్దుతున్నారు.

author img

By

Published : May 27, 2019, 2:47 PM IST

Updated : May 27, 2019, 6:02 PM IST

రెస్టారెంట్
వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్ల కొత్త ఎత్తులు

గుంటూరులో కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల యజమానులు కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. రెస్టారెంట్ ముందు భాగాన్ని అందరూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. భవనం గోడల్లోకి వాహనాలు బయటకు వచ్చినట్లుగా డిజైన్ చేస్తున్నారు.

జేకేసీ కాలేజి సమీపంలోని ఓ ఫుడ్ కోర్టు యజమాని కారు భవనానికి వేలాడుతున్నట్లుగా అమర్చారు. అటుగా వెళ్లేవారు ఎవరైనా చూస్తే కారు ఒకటో అంతస్థులో నుంచి బయటకు వచ్చిందా అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక బృందావన్ గార్డెన్స్ లో ఓ కాపీ షాప్ యజమాని సైతం ఇదే తరహాలో తన కేఫ్ ను తీర్చిదిద్దారు. కాకపోతే ఇక్కడ ఓ స్కూటర్ తన షాప్ నుంచి బయటకు వెళ్తున్నట్లు డిజైన్ చేశారు. వాస్తవంగా అక్కడ కారుని... ఇక్కడ స్కూటర్ సగానికి కట్ చేసి... ముందు భాగాన్ని మాత్రమే జాగ్రత్తగా గోడలకు బిగించారు. అయితే చూసేందుకు మాత్రం గోడలో నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఏవైనా ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షించటం మామూలే కాని... ఇలా తమ భవనం వెలుపలి భాగాన్ని వినూత్నంగా తీర్చిదిద్ది ఆకట్టుకోవటమే ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

ఇది కూడా చదవండి.

బిడ్డకు జన్మనిచ్చింది... ఆసుపత్రిలో వదిలేసింది

Intro:తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయన సోమవారం ఉదయం నైవేద్య సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల నుంచి శ్రీ పద్మావతి అమ్మవారిని చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, జిల్లా సంయుక్త పాలనాధికారి గిరీశా, సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు

Body:t

Conclusion:
Last Updated : May 27, 2019, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.