గుంటూరు జిల్లా గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్కే సైదా బుధవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. గురజాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో 11వ తేదీన గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
నేడు తిరిగి పరిస్థితి విషమించటంతో అధికారులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలో అయన మృతి చెందారు.
ఇదీ చదవండి: రవాణా అధికారుల తనిఖీలు .. 106 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు