ETV Bharat / state

'ధరలు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్​ జేబులు నింపుకుంటున్నారు' - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

మూడు రాజధానులు వద్దు - అమరావతి ముద్దు అంటూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 21 రోజులుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సీపీఐ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

relay hunger strike ended on Thursday
జేఏసీ ముగింపు శిబిరంలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి
author img

By

Published : Jan 31, 2020, 10:18 AM IST

జేఏసీ ముగింపు శిబిరంలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి

అమరావతిలోనే రాజధాని ఉండాలని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గత 21 రోజులుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం భయపడి పోలీసులతో అడ్దుకుంటుందని ...అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, నిరసన తెలియజేసే హక్కులను కాలరాస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. 30 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించిన సీఎం జగన్ ఐదేళ్లు ఉండటం కష్టమని ..జమిలి ఎన్నికలు వస్తే మూడేళ్లకే ముగించాల్సి ఉంటుందన్నారు.

జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: ప్రత్తిపాటి

వివేకా హత్య కేసులో జగన్ ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, మద్యం, ఇసుక ధరలు పెంచుతూ జగన్ జేబులు నింపుకుంటున్నారనీ, పెంచిన ప్రతిదాంట్లో జగన్ టాక్స్ ఉందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే పదవిలో కూర్చోపెట్టిన కేంద్రంపై మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఎందుకు ఒత్తిడి తీసుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

రాజధాని తరలింపు మీ తరమా?: రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.