ETV Bharat / state

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య - నేర వార్తలు

కోటప్పకొండ దేవస్థానం అతిథి గృహంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. దైవదర్శనానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

ఆత్మహత్య
ఆత్మహత్య
author img

By

Published : Aug 18, 2021, 7:53 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ దేవస్థానం అతిథిగృహంలో బుధవారం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. నంబూరుకు చెందిన పగడాల శ్రీనివాసరావు (60) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం రాత్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శనం నిమిత్తం వచ్చి ఆలయానికి చెందిన అతిథిగృహంలో బసచేశాడని పోలీసులు వివరించారు.

బుధవారం ఉదయానికి శ్రీనివాసరావు మృతి చెంది ఉండటాన్ని గమనించిన ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు చేతి మణికట్టుపై కోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు దైవదర్శనానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు నరసరావుపేట గ్రామీణ పోలీసులు తెలిపారు.

మృతుని బంధువులకు సమాచారం తెలిపి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ ఎస్సై లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: గుంటూరులో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.