ETV Bharat / state

Ration Rice Smuggling: అడ్డగోలుగా రేషన్​ బియ్యం మాఫియా.. అధికార పార్టీ నేతల అండదండలతోనే - కాకినాడ నుంచి విదేశాలకు ఏపీ రేషన్​ బియ్యం

Ration Rice Smuggling: రాష్ట్రంలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. కార్డుదారుకు రేషన్‌ చేరక ముందే దోపిడీ జరిగిపోతోంది. డీలర్లకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాల్లోనూ తూకం తగ్గుతోంది. రాష్ట్రంలో ఎక్కడ రేషన్ బియ్యం పట్టుబడినా.. మూలాలు మాత్రం కేరాఫ్‌ కాకినాడలోనే వెలుగుచూస్తున్నాయి. అక్కడి నుంచి లక్షల టన్నుల బియ్యం జోరుగా విదేశాలకు ఎగుమతవుతోంది. రేషన్ మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు ఏటా 4 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 21, 2023, 8:43 AM IST

Ration Rice Smuggling In AP: వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌ మాఫియా చెలరేగిపోయింది. నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంలా మార్చేసి, చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున అక్రమార్కులు నల్లబజారుకు తరలిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చౌకబియ్యం స్వాధీనం అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మిల్లుల్లోనూ వందల టన్నుల్లో రేషన్‌ బియ్యం బయటపడుతునే ఉన్నాయి. రాష్ట్రంలో నెలకు 2 లక్షల8 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే అందులో 40 శాతం వరకు పక్కదారి పడుతున్నాయంటే అక్రమార్కుల దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఏ ప్రాంతం నుంచి అయినా గమ్యస్థానం కాకినాడకే: ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు సేకరించేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా అధిక శాతం అక్రమ రవాణా వాహనాల గమ్యస్థానం మాత్రం కాకినాడలోని కొన్ని మిల్లులే. ఒకటీ అరా కృష్ణపట్నం వెళ్తున్నాయి. అక్కడి నుంచి నౌకల్లో విదేశాలకు చేరుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో ఈ అక్రమ రవాణా మూడు వ్యాన్లు.. ఆరు లారీల్లా సాగిపోతోంది. పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొని తరలించడంతో పాటు.. తూకంలో తరుగు రూపంలో భారీగా గోదాముల నుంచి మాయం చేస్తున్నారు. కొన్నిచోట్ల పేదలకు నెలల తరబడి పంపిణీ కూడా జరగడం లేదు. ఆ బియ్యం ఎటుపోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. పేదల బియ్యం పక్కదారితో ప్రభుత్వ ఖజానాకు ఏటా 4 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది.

ఎండీయూలు ఎంతిస్తే అంతే: రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఏ నెలలోనూ బియ్యం సరిగా అందుతాయనే భరోసా కార్డుదారులకు కరవైంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్‌ బండ్ల ద్వారా పంపిణీ చేస్తారో, డీలర్ల ద్వారా ఇప్పిస్తారో కూడా అంతుపట్టదు. వచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్లుగా తయారైంది. ఎండీయూ ద్వారా బియ్యం వచ్చినా కొన్నిచోట్ల 20 కిలోలకు బదులు.. 10 నుంచి 15 కిలోల చొప్పున ఇస్తున్నారు. మిగిలిన బియ్యం లేవంటున్నారు. మొత్తంగా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి.

సీఎం సన్నిహితులే అక్రమాల్లో చక్రం తిప్పుతున్నారు: అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా సీఎం జగన్ ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికి రేషన్‌ పథకం కావడంతో.. అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అక్రమాలు బయటపడినా, చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరొస్తుందనే భయంతో మిన్నకుంటున్నారు. అందులోనూ సీఎంకి సన్నిహితుడైన కాకినాడ జిల్లాకు చెందిన నేత కుటుంబమే చక్రం తిప్పుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మొక్కుబడి తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. దీంతో అక్రమార్కులు పట్టపగలే కార్డుదారుల నుంచి కిలోల లెక్కన బియ్యం కొనేసి.. బాహాటంగానే తరలిస్తున్నారు. చౌకబియ్యం అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ పౌరసరఫరాల శాఖ.. రైస్‌ ఏజ్‌ టెస్టింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం.

ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో నష్టం: రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నెలకు 2.31 లక్షల టన్నులు జరుగుతోంది. ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా ప్రభుత్వాలు 39 రూపాయల 35 పైసలు చొప్పున ఖర్చు చేస్తున్నాయి. ఏడాదికి 9 వేల 618 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయితే ఇందులో 40 శాతం బియ్యం నల్లబజారుకు తరలుతోంది. కార్డుదారుల నుంచి దాదాపు 40 శాతం అంటే 85 వేల టన్నులు దళారులు కొంటున్నారు. నామాత్రంగా కిలోకు 12 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి కిలోకు 39 రూపాయల 35 పైసల చొప్పున దాదాపు 4 వేల 13 కోట్లు నష్టం వస్తోంది. దోపిడీ చేసిన బియ్యాన్ని వివిధ రూపాల్లో మార్కెట్‌కు, విదేశాలకు అక్రమార్కులు చేరవేస్తున్నారు.

బియ్యం వాహనాలే కావడంతో అక్రమాలకు కలసివస్తోంది: ఎండీయూ వాహనాలు లేక ముందు రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసేవారు. కార్డుదారుల నుంచి కొన్నవి, ఇవ్వకుండా మిగుల్చుకున్న బియ్యాన్ని రాత్రి సమయాల్లో నల్లబజారుకు తరలించి విక్రయించేవారు. పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండేది. విజిలెన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తుండేవి. ఎండీయూ వ్యవస్థ ఏర్పాటయ్యాక.. వాటి ఆపరేటర్లే కొన్నిచోట్ల బియ్యం వ్యాపారం చేస్తున్నారు. చాలా చోట్ల కార్డుదారుల నుంచి నేరుగా వారే కిలో 10రూపాయల నుంచి 15 రూపాయల చొప్పున ఇచ్చి కొంటున్నారు. అవే వాహనాల్లో అక్రమ వ్యాపారులకు చేరవేస్తున్నారు. బియ్యం వాహనాలే కావడంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని తనిఖీ చేయడం దాదాపుగా జరగదు. ఇదే వారికి మరింత కలిసివస్తోంది. కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలుపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. సగటున ఒక్కో వాహనదారు రోజువారీ పంపిణీ చేసే బియ్యంలో 30 శాతం నుంచి 40 శాతం వరకు కార్డుదారుల నుంచి తిరిగి కొంటున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల రోజుకు 30 క్వింటాళ్లు పంపిణీ చేస్తే అందులో 12 క్వింటాళ్ల వరకు కొనేస్తున్నారు.

పట్టుబడితే సస్పెండ్​ చేసి చేతులు దులుపుకున్నారు: విశాఖ జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్‌ సీ-2 జోన్‌ పార్క్‌ ఏరియాలోని రేషన్‌ బండి వద్ద అధిక శాతం కార్డుదారులకు.. ఇవ్వాల్సిన బియ్యం కన్నా తక్కువలో తక్కువ 10 కేజీల వరకు కోత విధించారు. వాటికి బదులుగా డిజిటల్‌ పేమెంట్‌గా నగదు చెల్లించారు. కొందరు వాచ్‌మెన్లు తమకు బియ్యం కావాలన్నా ఇవ్వలేదు. అగనంపూడి 85వ వార్డు తలారివానిపాలెంలో ఈ నెల 9న చాలా మందికి కిలోన్నర నుంచి రెండు కేజీల వరకు బియ్యం తగ్గించి ఇచ్చారు. దీనిపై కార్డుదారులు ప్రశ్నించగా ‘అధికారులు అంతే ఇమ్మన్నారు.. ఎవరికి చెబుతారో చెప్పుకోండి అని సమాధానం ఇచ్చారు. వంశీ అనే కార్డుదారుకు 15 కేజీల బియ్యానికి పదమూడున్నర కేజీలే ఇచ్చారు. మరికొందరికి 20 కేజీలకు పద్దెనిమిదిన్నర కిలోలే దక్కాయి . లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎండీయూ నిర్వాహకుణ్ని సస్పెండ్‌ చేశారు.

అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపో సేల్స్‌మన్, ఎండీయూ ఆపరేటర్‌ కలిసి.. 3.65 టన్నుల బియ్యం, 305 కిలోల పంచదార, 339 కేజీల కందిపప్పును పక్కదారి పట్టించారు. గ్రామాలకు వస్తే సిగ్నల్‌ సరిగ్గా ఉండదంటూ గిరిజనులను నమ్మించి ముందే వేలిముద్రలు తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సేల్స్‌మెన్‌ను సస్పెండ్‌ చేసిన అధికారులు.. ఎండీయూ ఆపరేటర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి.

అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే: అక్రమార్కులు కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని.. బస్తాల్లోకి మార్చి మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు చేరవేస్తున్నారు. బియ్యం తరలింపులో ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టమవుతోంది. ప్రతి జిల్లాలోనూ కొందరు వైసీపీ నేతలకు చెందిన మిల్లుల్లోనే రీసైక్లింగ్‌ జరుగుతోందని ఇటీవల బియ్యం పట్టుబడిన సందర్భాల్లో వెల్లడైంది. మూతపడిన మిల్లులను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తరలింపు సమయంలో ఒక్కో లారీకి లక్ష వరకు ముట్టచెబుతున్నారు. వాహనం రోడ్డెక్కిన దగ్గర నుంచి మిల్లుకు, అక్కడ నుంచి పోర్టు సమీపంలోని మిల్లుకు చేరే వరకు.. అంతా అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది.

సూత్రధారులు కూడా అధికార పార్టీ నేతలే : ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం వ్యాపారానికి సూత్రధారులు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. పెళ్లూరులో ఒక మిల్లు నిర్వాహకుడు, వైఎస్సార్​సీపీ నాయకుడు కలిసి భారీ ఎత్తున చౌకబియ్యాన్ని తరలిస్తున్నారు. గ్రోత్‌ సెంటర్‌లో మూతపడిన మరో మిల్లులో రహస్యంగా చౌక బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి, తెల్లసంచుల్లో నింపి బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం పేరుతో విక్రయిస్తున్నారు.

బాపట్ల జిల్లాలోని చీరాల, అద్దంకి ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు, కొండపి, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో లారీలు, ఆటోల ద్వారా స్థానిక మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ తేలికపాటి పాలిష్‌ చేసి తెల్ల సంచుల్లోకి మారుస్తున్నారు. తర్వాత కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నారు.

అధికార పార్టీ నాయకుల అండదండలతోనే : నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని మిల్లులో ఇటీవల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మూడుసార్లు తనిఖీలు చేసి, 2వేల బస్తాలకు పైగా అక్రమ నిల్వలు గుర్తించారు. దీన్ని ఒంగోలుకు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్‌ భర్త మరికొందరితో కలిసి నిర్వహిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు రావడంతో కేవలం వంద బస్తాలే పట్టుబడ్డాయని తేల్చారు. ఒంగోలులో ఒక మహిళా ప్రజాప్రతినిధి కూడా స్నేహితురాలితో కలిసి డీలర్ల నుంచి బియ్యం సేకరించి వ్యాపారం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం వ్యాపారంలో ఆరితేరారు. ఆయన భార్య ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యాన్ని కాకినాడకు తరలిస్తున్నారు. గుడివాడలో ఇటీవల ధాన్యం మిల్లు నుంచి కాకినాడ తరలించేందుకు సిద్ధం చేసిన 380 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. మిల్లు లైసెన్సు సస్పెండ్‌ చేసి, 6ఏ కేసు పెట్టారు.

క్వింటాళ్లకు క్వింటాళ్ల బియ్యం: తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది 118 కేసులు నమోదవగా పీడీఎస్‌ బియ్యం 3వేల 117 క్వింటాళ్లు, కందిపప్పు 19 క్వింటాళ్లు, పంచదార 16 కింటాళ్లు పట్టుబడింది. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 82 కేసులు నమోదు చేసి 2వేల 314 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మే 5న రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలిస్తున్న 16.25 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. 6ఏ కేసు నమోదు చేశారు.

గత నెల 29న రాజమహేంద్రవరం విజిలెన్స్‌ అధికారులు కొవ్వూరు హైవే కూడలి వద్ద 17లక్షల 8 వేల విలువ చేసే సుమారు 23 టన్నుల 70 కేజీల బియ్యాన్ని సీజ్‌ చేశారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన వద్ద సుమారు 9 లక్షల విలువైన బియ్యాన్ని పట్టుకున్నారు. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేసి 13 వందల 50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లాలో..: జిల్లాలోని ఆళ్లగడ్డ పురపాలక సంఘం కౌన్సిలర్‌ 144 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. ఈయనపై నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసు నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఏటా అక్రమంగా తరలించే రేషన్‌ బియ్యానికి సంబంధించి రెండొందల కేసులు నమోదవుతున్నాయి. రెండు జిల్లాల్లో పౌరసరఫరాల గోదాముల్లో 3 వేల టన్నులకుపైగా పట్టుబడిన రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విజయనగరంలోని బాలాజీనగర్‌ -నాగోజిపేట ప్రాంతంలో ఇటీవల ఎండీయూ వాహనాన్ని ఆహార సలహా కమిటీ సభ్యుడు బి.కాంతారావు తనిఖీ చేయగా.. బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయని గుర్తించి కేసు నమోదు చేయడం అక్రమాలకు అద్దంపడుతోంది.

కోట్లలో దోపిడి : చౌక బియ్యం సరఫరాలోనే టన్నుకు 80 కిలోల దోపిడీ జరుగుతోంది. మండల స్థాయి నిల్వ కేంద్రాలకు, అక్కడి నుంచి రేషన్‌ దుకాణాలకు పంపే బియ్యం తూకంలోనే భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఒక్కో బస్తాకు 3 కిలోల నుంచి 5 కిలోల వరకు బియ్యం తగ్గుతున్నాయి. సగటున 4 కిలోల లెక్కన చూసినా.. టన్నుకు 80 కిలోలు అక్కడే వెనకేసుకుంటున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా నెలకు సుమారు 17 వేల టన్నుల బియ్యాన్ని.. డీలర్లకు చేరకముందే స్వాహా చేస్తున్నారు. అంటే కిలోకు 30 రూపాయల లెక్కన 50కోట్ల 88లక్షలు దోపిడీ జరుగుతోంది. ఏడాదికి 610 కోట్ల 56 లక్షల ప్రజా ధనం లూటీకి గురవుతోంది.

అందరికీ వాటలుండటమే: మిల్లుల నుంచి గోదాములకు చేరే బియ్యంలో కొంత తరుగు ఉంటోంది. గోదాముల నుంచి డీలర్లకు చేరేసరికి ఇది మరింత పెరుగుతోంది. ఇలా మిగిలే బియ్యాన్ని నేరుగా గోదాముల నుంచే అక్రమ వ్యాపారులు మిల్లులకు చేరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గోదాముల నుంచి డీలర్లకు బియ్యం సరఫరా చేసే వాహన కాంట్రాక్టులకు భారీ డిమాండు ఉండటానికి ఇదే ప్రధాన కారణం. వీరికి బియ్యం అక్రమ రవాణా రూపంలో కోట్లు మిగులుతున్నాయి. బియ్యం బస్తా 50 కిలోలు ఉండటం లేదని డీలర్లు, ఎండీయూలు గగ్గోలు పెడుతున్నా.. పరిశీలిస్తామనే మాటలకే అధికారులు పరిమితమవుతున్నారు. దీంతో కొన్నిచోట్ల ఎండీయూ ఆపరేటర్లు.. కార్డుదారులకు ఇచ్చే బియ్యాన్ని తగ్గించి ఇస్తున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా అందరికీ వాటాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం.

అధికారులు అక్రమార్కులకే వత్తసు: రాష్ట్రంలో ఏ మూలన రేషన్‌ బియ్యం పట్టుబడినా.. వాటి గమ్యస్థానం కాకినాడే అని బయటపడుతోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. కొన్నేళ్లుగా విదేశాలకు పెరుగుతున్న బియ్యం ఎగుమతుల లెక్కలే దీనికి నిదర్శనం. మండల తహసీల్దారు నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయం తెలిసినా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. తమ పార్టీలోని కొందరు నేతలే అక్రమ బియ్యం సేకరణ, ఎగుమతుల్లో సూత్రధారులుగా ఉన్నారని.. వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఏ సంవత్సరంలో ఎంతంటే: రాష్ట్రంలో బియ్యం వ్యాపారం మొత్తం వారి చేతుల్లోనే నడుస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతులు, అక్కడ అవసరమైన గోదాములు కూడా వారే నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లలో వివిధ నౌకాశ్రయాల నుంచి బియ్యం ఎగుమతులు భారీగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో విదేశాలకు 4 వేల 322 కోట్ల విలువైన 16 లక్షల 94 వేల 364 టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. అదే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 18 వేల 693కోట్ల విలువైన 67లక్షల 32 వేల 448 టన్నుల బియ్యం తరలిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నాటికే 1,439 కోట్ల విలువైన 4లక్షల 79వేల 430 టన్నులు ఎగుమతయ్యాయి. బియ్యం అక్రమ రవాణా ఎంతగా పెరిగిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.