ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్​లో అరుదైన కేన్సర్ శస్త్రచికిత్స విజయవంతం

author img

By

Published : Jan 13, 2021, 3:51 AM IST

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో కేన్సర్‌ ఆసుపత్రిలో అరుదైన, క్లిష్టతరమైన శస్త్రచికిత్సను వైద్యులు దిగ్విజయంగా పూర్తి చేశారు. నగరానికి చెందిన 50ఏళ్ల మహిళ గర్భ సంచిలో ఏర్పడిన కేన్సర్​ని తొలిగించారు.

rare cancer operation at ggh
గుంటూరు జీజీహెచ్​లో అరుదైన కేన్సర్ శస్త్రచికిత్స విజయవంతం

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో కేన్సర్‌ ఆసుపత్రిలో 50 ఏళ్లు పైబడిన ఓ మహిళా రోగికి అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు దిగ్విజయంగా పూర్తిచేశారు. ఆమె గర్భ సంచిలో ఏర్పడిన కేన్సర్, రెండు అండాశయాలను తొలిగించారు.

ప్రస్తుత రోజుల్లో గర్భ సంచి కేన్సర్‌ శస్త్రచికిత్సలు సాధారణమే అయినా ఈ రోగి‌ విషయంలో మాత్రం వైద్యులు చాలా శ్రమించారు. పేషెంట్‌ భారీ శరీరం కలిగి ఉండటం, అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల మూడున్నర గంటలకుపైగా శ్రమించి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. సర్జికల్‌ ఆంకాలజీలో ఇదో అరుదైన శస్త్రచికిత్సగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్‌ పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వివరించారు.

ఇదీ చదవండి:

రహదారి విస్తరణ పనులు జరిగేనా.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.