ETV Bharat / state

NEET Exams: నీట్‌లో మెరిశారు.. కుటుంబాన్ని మురిపించారు.. - నీట్​ పరీక్షల రిసల్ట్స్​

తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తమ కృషిని జోడించారు. జాతీయస్థాయిలో జరిగిన నీట్‌ పరీక్షల్లో సత్తాచాటారు. మంచి ర్యాంకులతో మెరిశారు. వైద్యులు కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆ విద్యార్థుల ప్రతిభ గురించి తెలుసుకుందాం.

NEER Exams
NEER Exams
author img

By

Published : Nov 3, 2021, 1:09 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని నవోదయనగర్‌కు చెందిన కశిందుల చైతన్యకృష్ణ నీట్‌ 2021 పరీక్షలో రాణించి.. జాతీయ స్థాయిలో 60వర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు మస్తాన్‌రావు, ఉషారాణిది నాదెండ్ల మండలం సాతులూరు స్వగ్రామం కాగా.. కొన్నేళ్లుగా నరసరావుపేటలో ఉంటున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయమే వృత్తిగా ఉన్నారు. తాతయ్య హనుమంతరావు, అమెరికాలో వైద్యునిగా ఉన్న బాబాయి రామకృష్ణ మార్గదర్శనంలో వైద్యవిద్యలో చేరేందుకు నాలుగేళ్ల పాటు విద్యార్థి కృషిచేశాడు.

తల్లిదండ్రులతో చైతన్యకృష్ణ

9, 10 తరగతులు విశ్వభారతిలో చదివాడు. ఇంటర్మీడియట్‌ విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. ఇంటర్‌లో 985 మార్కులు సాధించాడు. చైతన్యకృష్ణ అక్క రీతు చందన ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

" వైద్యవిద్యలో చేరాలన్న లక్ష్యంతో నాలుగేళ్లుగా కృషి చేశా. పాఠశాల విద్య నుంచే ఎంబీబీఎస్‌ చదవాలన్న కోరికతో అనుగుణంగా సాధన చేశా. 9, 10 తరగతుల సమయంలోనే ఇంటర్‌కు సంబంధించిన సిలబస్‌ను చదవడం ప్రారంభించా. ఇంటర్‌లో చేరిన తర్వాత పలుమార్లు పునశ్ఛరణ చేశా. వారాంతపు పరీక్షలు రాస్తూ ప్రతి అంశంపైనా పూర్తి పట్టు సాధించేలా చదివా. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు చదవడంతోపాటు సిలబసును మాత్రమే చదవడం కూడా లాభించింది. - చైతన్యకృష్ణ

765వ ర్యాంకు

నాదెండ్లకు చెందిన దేవభక్తుని రవికుమార్‌.. గుంటూరు కళ్లెం నూలు పరిశ్రమలో దూది బయ్యర్‌గా, అతని భార్య అన్నపూర్ణ అక్కడే బాలకుటీర్‌ (చేతన) ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు కోటయ్య స్వామి నీట్‌ ఫలితాల్లో 765వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు బాలకుటీర్‌లో చదివాడు. తొమ్మిదో తరగతి నుంచే వైద్య వృత్తి చేపట్టాలన్న బలమైన కాంక్షతో ముందుకుసాగాడు. గుంటూరులో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు. విజయవాడ శ్రీభవిష్య అకాడమీలో నీట్‌కి లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని లక్ష్యం దిశగా కదిలాడు. నీట్‌లో ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకు సాధించాడు.

గురి తప్పని లక్ష్యం

తల్లిదండ్రులు, సోదరుడితో సత్యకేశవ్‌

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సైన్సు పట్ల ఇష్టంతో తొమ్మిదో తరగతిలో ఆ విద్యార్థి నిర్దేశించుకున్న లక్ష్యం గురి తప్పలేదు. ఒత్తిడి లేని ప్రణాళికాయుత అభ్యసనతో నీట్‌లో మెరిశాడు. అఖిల భారతస్థాయిలో 38వ ర్యాంకు సాధించి సత్తెనపల్లికి వన్నె తెచ్చాడు. పట్టణానికి చెందిన బాలాజీ స్వీట్స్‌ నిర్వాహకుడు తెంటు బాలాజీ, అరుణకుమారి దంపతుల రెండో కుమారుడు సత్యకేశవ్‌ బాల్యం నుంచే చదువులో చురుకు. అతనిలోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివాడు. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూపులో 969 మార్కులు సాధించాడు. నీట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి వైద్యవిద్య అభ్యసించాలని పట్టుదలతో చదివాడు. 720 మార్కులకు 710 సాధించి 38వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. అత్యుత్తమ కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. బాలాజీ పెద్ద కుమారుడు చంద్రశేఖర్‌ గత ఏడాది ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాడు. రెండో కుమారుడు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. పట్టణ ప్రముఖులు సత్యకేశవ్‌ను అభినందించారు. రేడియాలజిస్టు అవుతానని సత్యకేశవ్‌ చెబుతున్నాడు.

ఎమ్మెల్యే శ్రీదేవి కుమార్తె ప్రతిభ

కుమార్తె భవ్యకు కేకు తినిపిస్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి

తాడికొండ, న్యూస్‌టుడే: జాతీయ వైద్య విద్య పరీక్ష (నీట్‌)-2021లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కుమార్తె విజయ వెంకట భవ్య ఎస్సీ కేటగిరిలో 40, ఓపెన్‌ కేటగిరిలో 2050 ర్యాంకుతో ప్రతిభ చాటారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీదేవి తన కుమార్తెకు కేకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కష్టపడి చదివితే ర్యాంకులు వస్తాయని, దేవుడి ఆశీసులతో తన బిడ్డ మరింత ఉన్నత స్థాయికి చేరి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో తన కుమార్తెకు మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉందన్నారు. విజయవెంకట భవ్య మాట్లాడుతూ తన తల్లి వైద్యురాలు కావడంతో చిన్నప్పటి నుంచి తనకు వైద్య విద్యపై మక్కువ పెరిగిందని, ఆమె సూచనలతో కష్టపడి చదివి పరీక్ష రాశానని, మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆమెకు కుటుంబ సభ్యులు, వైకాపా నాయకులు అభినందనలు తెలిపారు.

వినుకొండ యువతి సత్తా

వినుకొండ, న్యూస్‌టుడే : నీట్‌ ఫలితాల్లో పట్టణానికి చెందిన గంగినేని ఉషారాణికి జాతీయ స్థాయిలో కేటగిరి ర్యాంకు 652 రాగా, జనరల్‌లో 5480 సాధించింది. పదో తరగతి వరకు వినుకొండలో, ఇంటర్‌ విజయవాడలో చదివి తొలి ప్రయత్నంలోనే మెడికల్‌ సీటు దక్కించుకుంది. ఆమె సోదరి రెండేళ్ల క్రితం నీట్‌లో ప్రతిభ చాటి పుదుచ్చేరిలో జిప్‌మర్‌లో మెడిసిన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోందని విద్యార్థిని తండ్రి గంగినేని శ్రీనివాసరావు తెలిపారు. తన ఇద్దరు పిల్లలు మెడిసిన్‌ సీట్లు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

13 గంటలు చదివి..

గుంటూరు జిల్లా నుదురుపాడు విద్యార్థి నీట్​లో మెరిశాడు. ఫిరంగిపురం మండలం నుడురుపాదు గ్రామానికి చెందిన తాలకొల సాయికిరణ్​ రెడ్డి నీట్​లో 445వ రాంకు సాధించి సత్తా సాటాడు. మొత్తం 720 మార్కులకు గాను 690 మార్కులు సాధించాడు. వైద్యుడుగా సేవల చేయడమే తన లక్ష్యమని సాయికిరణ్​ అన్నాడు. ప్రతి రోజు 13 గంటలు పాటు కష్టపడినట్లు తెలిపాడు.

ఇదీ చదవండి:

ఇదేందయ్యా ఇదీ.. ఓటరు జాబితాలో అభ్యర్థుల పేర్లే లేవుగా..!?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.