కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా.. గుంటూరు జిల్లా నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 24 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. కొవిడ్ సెంటర్లో కరోనా బాధితులకు అందుతున్న వైద్యం వివరాలపై ఆరా తీశారు.
సముద్ర తీర ప్రాంతంలో కరోనా సోకిన వారు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, ఈ క్రమంలో మెరుగైన చికిత్స అందక రోగులు ప్రాణాలు కొల్పుతున్నారని మోపిదేవి అన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు ఇటీవల రేపల్లె సీహెచ్సీలో కొవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పుడు నిజాంపట్నంలో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ఇదీ చదవండి: