అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. రెండ్రోజుల్లో జిల్లావ్యాప్తంగా 1377 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జిల్లాలోని 57 మండల్లాల్లోనూ వానలు పడ్డాయి. 10 మండలాల్లో 20మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తుళ్లూరులో 30.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఆగస్టులో ఇప్పటివరకు 105 మీ.మీ. వర్షపాతం నమోదు కాగా.. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 27 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జులైలో 68 శాతం, జూన్ లో 20 శాతం అధిక వర్షపాతాలు ఇప్పటికే నమోదయ్యాయి.
సాధారణ వర్షపాతానికి మించి ఎడతెగని విధంగా కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి వేసి 2 నెలలు అవుతున్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కల వద్ద నీరు నిలవకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అధిక వర్షాలతో ఆశించినస్థాయిలో వరి నాట్లు పడలేదు. నేరుగా వెదజల్లే విధానం ఊపందుకోలేదు. పొలాల్లో నీరు ఇంకితే తప్ప పంట వేసుకునే అవకాశం లేదని రైతులు నిట్టూరుస్తున్నారు..
ఇవీ చదవండి..