గుంటూరు జిల్లా ప్రత్రిపాడు సర్పంచి వనపర్తి రమాదేవి, వార్డు సభ్యులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వైకాపా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హోంమంత్రి మేకతోటి సుచరిత విజేతలను అభినందించారు. వారితో కలిసి ఆమె రెవెన్యూ కార్యాలయం నుంచి అంకమ్మ గడు, మల్లాయపాలెం కూడలి మీదుగా పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం రమాదేవిని ఘనంగా సత్కరించారు. ఉప సర్పంచ్ బాపతు వెంకటేశ్వర రెడ్డితో పాటు వైకాపా నాయకులు గట్టు విజయ్, విప్పాల కృష్ణా రెడ్డి, సలాం, ఓం ప్రకాశ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్టు