గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో.. తమ సమస్యలపై గ్రామస్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఊళ్లో రహదారిపై గాడిదల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు.. ఓ గాడిదను తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయంలో కట్టేశారు. గాడిదల విచ్చలవిడి సంచారంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: AMARAVATI: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. 625వ రోజు ఆందోళనలు