శాఖమూరు స్మృతి వనంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలంటూ అమరావతి ఎస్సీ ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడకు తరలించవద్దంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వం ఎస్సీలపై గౌరవంతో రాజధానిలో 30 ఎకరాలు కేటాయించి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 30 శాతం పనులు సైతం పూర్తి చేశారని ఐకాస నేతలు చెప్పారు. ఓ వైపు రాజధానిని తరలిస్తున్నారని.. ఇప్పుడు స్మృతి వనాన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇదీ చూడండి..