మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో అమరావతి పరిరక్షణ ఐకాస నేతలు, కార్యకర్తలు... నిరసన దీక్ష నిర్వహించారు. 50 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దీక్షలో పాల్గొన్న తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని సమస్యతో ఎటువంటి పండగలు, పెళ్లిళ్లు జరగడం లేదని ఆమె అన్నారు. స్వామీజీలకు రాజకీయాలతో పని ఏమిటని నిలదీశారు. అసమర్థ నిర్ణయాలతో భవిష్యత్ తరాలు నష్టపోతాయని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.
ఇదీ చూడండి: