ETV Bharat / state

సీఎం నివాసం వద్ద ప్రధానమంత్రి పోషణ అభియాన్ ఒప్పంద ఉద్యోగుల ఆందోళన - ప్రధాన మంత్రి పోషణ అభియాన్ ఉద్యోగులు వార్తలు

తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రధాన మంత్రి పోషణ అభియాన్ ఒప్పంద ఉద్యోగులు.. తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద ధర్నాకు దిగారు. ఏప్రిల్ నుంచి తమకు జీతాలు ఇవ్వలేదనీ.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

agitation at cm house
సీఎం నివాసం వద్ద ప్రధాన మంత్రి పోషణ అభియాన్ ఒప్పంద ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Sep 14, 2020, 3:57 PM IST

ప్రధాన మంత్రి పోషణ అభియాన్ పథకంలో ఒప్పంద పద్ధతిలో గతేడాది తీసుకున్న 340 మందిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ.. పోషణ అభియాన్ ఉద్యోగులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. గత సంవత్సరం నవంబర్​లో పోషణ అభియాన్ పథకంలో భాగంగా.. ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ 340 మందికి ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు. లాక్​డౌన్ కారణంగా 13 జిల్లాల్లో ఉన్న పోషణ అభియాన్ ఉద్యోగులకు ఎటువంటి జీతాలు ఇవ్వలేదు. ఆర్థిక శాఖ అనుమతి లేదనీ.. ఉద్యోగులు విధులకు హాజరుకావద్దని ఏప్రిల్ 1న ప్రభుత్వ అధికారులు సమాచారం పంపించారు. అప్పటినుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని పోషణ అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా స్పందించి.. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'స్వర్ణ ప్యాలెస్ కేసులో ఛైర్మన్​ను కస్టడీలోకి తీసుకోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.