ETV Bharat / state

నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్​కు ప్రధాని ప్రశంసలు.. తయారీలో తెలుగు అధికారీ కీలకపాత్ర

PM Modi Appreciation to Telugu Person : తెలుగు వ్యక్తి బుద్ధ చంద్రశేఖర్ రూపొందించిన 'నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్'కు ప్రధాని మోదీ ప్రశంసలు దక్కాయి. ఈ పోర్టల్​ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు 75 వేల సంస్థలు నమోదయ్యాయని, అవి 25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించాయని తెలిపారు. తాను రూపొందించిన 'నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్' గురించి ప్రస్తావిస్తూ.. ప్రశంసించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏఐసీటీఈ సీఓఓ బుద్ధ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన స్పందనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

Buddha Chandrasekhar
Buddha Chandrasekhar
author img

By

Published : Feb 26, 2023, 7:50 PM IST

PM Modi Appreciation to Telugu Person : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'నూతన విద్యా విధానం'లో భాగంగా ఏర్పాటైన 'నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్'ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న బుద్ధ చంద్రశేఖర్ ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. ఈ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అటు పారిశ్రామిక రంగానికి, ఇటు విద్యాసంస్థలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

బడ్జెట్ అనంతరం వెబినార్​ను ప్రధాని మోదీ నిర్వహించారు. విద్యతో పాటు పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడం గురించి నొక్కిచెప్పారు. దేశ భవిష్యత్తు అవసరాలను తీర్చేలా నూతన విద్యా విధానం రూపొందిందని, సంక్లిష్టంగా ఉన్న భారతీయ విద్యా వ్యవస్థను ఇది సులభతరం చేసిందని అన్నారు. ఈ విధానంలో విద్యతో పాటు నైపుణ్య శిక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్‌ల కోసం 'నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్' పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రధాని పారిశ్రామిక, విద్యారంగ సంస్థలకు సూచించారు.

ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు 75 వేల సంస్థలు నమోదయ్యాయని, అవి 25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించాయని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు స్టైపెండ్ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలో భారతదేశానికి తయారీ రంగానికి కేంద్రంగా మార్చే లక్ష్యంలో భాగంగా 'ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0' పథకం లక్షలాది మంది యువతను నిపుణులుగా మార్చనుందని అభిప్రాయపడ్డారు.

కృతజ్ఞతలు తెలిపిన బుద్ధ చంద్రశేఖర్: తాను రూపొందించిన 'నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్' గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏఐసీటీఈ సీఓఓ బుద్ధ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన స్పందనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ పోస్టులో పోర్టల్ ఆవశ్యకత గురించి వివరిస్తూ.. ఇప్పటి వరకు చదువుకున్నవారికి డిగ్రీలు మాత్రమే చేతికొచ్చేవని, కొన్ని పేరుమోసిన విద్యాసంస్థల్లో చదువుకున్నవారు మినహా చాలామందిలో ఉద్యోగాలకు అవసరమైన ఇతర నైపుణ్యాల కొరత ఉండేదని గుర్తుచేశారు. ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ నైపుణ్యాల కొరత కారణంగా అటు విద్యార్థులు (నిరుద్యోగులు), ఇటు పరిశ్రమలు ఇబ్బందిపడే పరిస్థితి ఉండేదన్నారు. అయితే విద్యార్థులను ఆయా రంగాల్లో నిపుణులుగా మార్చే సరికొత్త విద్యావిధానం కారణంగా డిగ్రీ పట్టా చేతిలో పట్టుకునే సమయానికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు కూడా తెలిసిన మానవ వనరులను సిద్ధంగాఉంటాయని బుద్ధ చంద్రశేఖర్ అన్నారు. ఈ క్రతువులో 'నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్' లక్షలాది మంది యువతకు నైపుణ్యాలను అందజేస్తూ, పని అనుభవాన్ని అందజేస్తుందని తెలిపారు. విద్యాసంస్థలకు, పరిశ్రమలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ పోర్టల్ పూడ్చి, ఒక వారధిలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు: విద్యార్థులు, పరిశ్రమలు సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించిన ఈ పోర్టల్ అభివృద్ధి వెనుక వెన్నుతట్టి నడిపించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి, ఏఐసీటీఈ ఛైర్మన్ ప్రొ. సీతారాం, ఎన్​ఈటీఎఫ్​ ఛైర్మన్ ప్రొ. అనిల్ సహస్రబుద్ధెతో పాటు తన బృందంలో పనిచేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2025 నాటికి 1 కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించాలన్న లక్ష్యంతో పోర్టల్ రూపొందించినట్టు బుద్ధ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనతో పాటు అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలతో పాటు వ్యాపార దృక్పథం పెంపొందించడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.