Students Problems: ఇక్కడ రైల్వే మార్గం మీదుగా ప్రమాదకరంగా వెళుతున్న బాలలు గుంటూరు జిల్లా వేమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఈ పాఠశాల భవనం పదేళ్ల క్రితం శిథిలమైంది. దీంతో సమీపంలో ఉన్న ఉర్దూ పాఠశాలకు చెందిన ఒక గదిని కేటాయించారు. అప్పటినుంచి అక్కడే అవస్థల మధ్య 70 మంది విద్యార్థులకు బోధన కొనసాగిస్తున్నారు. పైగా విద్యార్థులంతా రైల్వేట్రాక్ అవతలివైపు నివాసముంటున్నారు. దీంతో నిత్యం ఇలా రైల్వే మార్గం దాటి పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పెరగడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నూతన భవనాన్ని విద్యార్థులు నివాసం ఉంటున్న ప్రాంతంవైపు నిర్మించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: RTC Charges: ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం.. సీఎం వద్దకు త్వరలో ప్రతిపాదనలు