మూడు రాజధానుల నిర్ణయంపై ముఖ్యమంత్రి మనసు మార్చుకోవాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. 550 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్న రైతులు, మహిళలను అభినందించారు. ఓ వైపు రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసుల సాయంతో వారిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పుల్లారావు ఆరోపించారు.
రాజధాని పరిధిలోని అసైన్డ్ రైతులకు సైతం వార్షిక కౌలు చెల్లించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. కర్నూలులో తెదేపా నేతల హత్యను పుల్లారావు ఖండించారు. తెదేపా నేతలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని.. అధికారం మారినప్పుడు తప్పు చేసిన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత.. కానీ ఆ విషయం మరువొద్దట!