గుంటూరులోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సంచాలకుల కార్యాలయం ఎదుట పోషణ అభియాన్ పొరుగు సేవల ఉద్యోగులు రెండోరోజూ ఆందోళన కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా 340 మందిని అర్థాంతరంగా తొలగించారని.. తమ భవిష్యత్ మాటేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యోగాలు మానేసి పోషణ అభియాన్ ఉద్యోగులుగా చేరామని.. కరోనా కాలంలో తమ కుటుంబాలను వీధిన పడేయటం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం మానవీయ కోణంలో పునరాలోచించి తమను విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇదీచదవండి