గుంటూరు జిల్లా రాష్ట్ర స్త్రీ - శిశు సంక్షేమ కార్యాలయం ఎదుట పోషన్ అభియాన్ పథకం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమను విధుల నుంచి తొలగించారంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. గత సంవత్సరం నవంబర్లో తమను ఏడాది కాంట్రాక్టు కింద ఉద్యోగాలు ఇచ్చి.. 6 నెలల వ్యవధిలోనే విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోషన్ అభియాన్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న 340 మంది ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు. తక్షణమే తమను ఉద్యోగాలలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. రెండు పదవులు.. నాలుగు పేర్లు.. నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ!