ETV Bharat / state

పోలీసు వారోత్సవాల్లో భాగంగా మంగళగిరిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వినియోగించే పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లల్లో నిద్రపోతున్నారంటే పోలీసులే కారణమని.. వారు చేసే త్యాగాలు ఎంతో విలువైనవని ఎమ్మెల్యే ఆర్కే కొనియాడారు.

open hourse program
ఓపెన్ హౌస్ కార్యక్రమం
author img

By

Published : Oct 26, 2020, 4:13 PM IST

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. మంగళగిరి పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్​ను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పోలీసులు వినియోగించే అత్యాధునిక ఆయుధాలను ప్రజలకు చూపించి.. వాటి గురించి వివరించారు.

ఎస్​ఎల్​ఆర్, 303 రైఫిల్, పిస్టల్, రివాల్వర్, బాష్పవాయు గోళాలు వినియోగించే తుపాకీ, ల్యాండ్ మైన్స్​ను కనిపెట్టే పరికరాలు, నేరం జరిగిన సమయంలో ఆధారాల కోసం సేకరించే వేలిముద్రల పరికరాలను హౌస్​లో ప్రదర్శనకు ఉంచారు. వీటిలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న పిస్టల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లల్లో నిద్రపోతున్నారంటే పోలీసులే కారణమని.. వారు చేసే త్యాగాలు ఎంతో విలువైనవని ఆర్కే కొనియాడారు.

ఇవీ చదవండి..

మైలవరం సాయి బాబా ఆలయంలో మహా సమాధి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.