ETV Bharat / state

వైకాపా ప్లీనరీ వద్ద రివాల్వర్‌.. ఇంతకీ అది ఎవరిదంటే..!

Police Seized Revolver: వైకాపా ప్లీనరీ వద్ద మంగళగిరి గ్రామీణ పోలీసులు రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాకు చెందిన ఓ జడ్పీటీసీ సభ్యులు తన వద్దనున్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను.. తనిఖీ చేస్తున్న పోలీసులకు చూపారు. దాని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్లీనరీ ముగిసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పగిస్తామన్నారు.

రివాల్వర్‌
రివాల్వర్‌
author img

By

Published : Jul 11, 2022, 5:46 PM IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన వైకాపా రాష్ట్ర స్థాయి ప్లీనరీ వద్ద మొదటిరోజు శుక్రవారం మంగళగిరి గ్రామీణ పోలీసులు లైసెన్స్‌డ్‌ రివాల్వరును స్వాధీనం చేసుకున్న విషయం ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా గడివేముల మండలం జడ్పీటీసీ సభ్యులు ఆర్‌బీ చంద్రశేఖర రెడ్డి తన అనుచరులతో ప్లీనరీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు పెన్నులనూ లోపలికి అనుమతించకపోవడం గమనించారు. ఈ నేపథ్యంలో తన వద్దనున్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను అక్కడ తనిఖీ చేస్తున్న ఎస్సైకు చూపారు. ఆయన దాన్ని స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి, వారి ఆదేశాలతో మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

రెండోరోజు శనివారం ప్లీనరీ ముగిసిన తర్వాత రాత్రి స్టేషన్‌కు వెళ్లిన జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖరరెడ్డి రివాల్వర్‌ను తనకు అప్పగించాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. అనంతరం జడ్పీటీసీ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ 2012లో రివాల్వర్‌కు లైసెన్స్‌ తెచ్చుకున్నానని, 2024లో రెన్యూవల్‌ చేయించాల్సి ఉందని తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.