పోలీసులు ఎన్ని రకాలుగా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నా అక్రమార్కులు తమ పని చేసుకుంటూ పోతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి, మద్యం, గుట్కాలు తరలిస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా ప్రతీ సారి ఏదో ఒక రకంగా తరలిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు.
కొంత మంది వ్యక్తులు విశాఖ నుంచి నెల్లూరుకి అక్రమంగా 1000కిలోల గంజాయిని తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. నిందితులు ఎవరికీ అనుమాన రాకుండా మినీ లారీలో పైనాపిల్ లోడ్ నింపారు. లోపల మాత్రం గంజాయిని లోడ్ చేశారు. మంగళగిరి గ్రామీణ పోలీసులకు అందిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పైనాపిల్ లోడుతో వెళ్తున్న మినీ లారీలో ఒక టన్ను గంజాయిని గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించామని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: Flash: వ్యవసాయ బావిలో పడి బాలిక, ఇద్దరు యువకులు మృతి