గుంటూరు జిల్లా నరసరావుపేట శివారులో సిమెంట్ లారీలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నరసరావుపేటకు చెందిన కొత్త రవిచంద్ర అనే వ్యక్తి తెలంగాణ రెడ్డిగూడెంలోని సతీశ్ అనే మిత్రుని ద్వారా మద్యం తెప్పించుకుని విక్రయిస్తున్నాడని పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ క్రమంలో వాహన తనిఖీలు జరపగా.. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీలో 96 కేసుల మద్యం సీసాలను గుర్తించారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే లారీడ్రైవర్ రాజశేఖర్, సత్యనారాయణలతో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు కారకులైన ప్రధాన నిందితులు కొత్త రవిచంద్ర అతనికి మిత్రుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండీ.. యువతిపై అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం