గుంటూరు జిల్లా(guntur district) రేపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో వాహనాల బ్యాటరీల చోరీకి పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్(gang arrest) చేశారు. రాత్రి సమయంలో ఇంటి బయట ఉంచిన... ఆటో, ట్రక్ వాహనాల బ్యాటరీలను టార్గెట్ చేసి దుండగులు చోరీ చేసేవారని పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో..
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా సమాచారంతో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను 22వ వార్డులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 22వ వార్డుకు చెందిన కళ్లేపల్లి నాగ సుందరయ్య(36), 9వ వార్డుకు చెందిన కొనగాల నాగమల్లేశ్వరరావు, మరొకరు బాల నేరస్తుడిగా గుర్తించారు. రూ.1.50 లక్షలు విలువ చేసే 26 బ్యాటరీల(vehicle batteries)ను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి వినియోగించిన ఆటో, బైక్ను సీజ్(auto, bike Seize) చేసి.. కేసు నమోదు చేశామన్నారు.
జల్సాల కోసం..
జల్సాల కోసం త్వరగా డబ్బు సంపాదించాలని నిందితులు దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకేమైనా దొంగతనాలు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. దొంగతనం చేసిన బ్యాటరీలను కొన్న కొందరు వ్యాపారస్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి