లాక్డౌన్తో మూత పడిన ఆలయాలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఆలయాల కమిటీ సభ్యులు, చర్చి నిర్వాహకులు, ముస్లిం పెద్దలతో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు సమావేశం నిర్వహించారు. వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టలేదని... ప్రార్థనా స్థలాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తుల కోసం శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉదయం 7నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే దేవాలయాలు, చర్చిలు, మసీదులను తెరవాలని స్పష్టం చేశారు. ఆలయాల్లో అన్నదానాలకు అనుమతి లేదని.. సమస్యలు వస్తే ఆలయ కమిటీలు పరిష్కరించుకోవాని చెప్పారు.
ఇదీ చదవండి: