ETV Bharat / state

తుమ్మల చెరువు గట్టు వద్ద పోలీసులు తనిఖీలు.. ఇద్దరు నిందితులు అరెస్టు

తుమ్మల చెరువు టోల్​గేట్​ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో నిందితుడితో పాటుగా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ద్విచక్ర వాహనాలు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

police arrested two Accused in liquor smuggling
మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ నిందితులు
author img

By

Published : Nov 11, 2020, 11:54 AM IST

జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్న సర్వేపల్లి అంకమ్మరావును అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ విజయభాస్కర్​రెడ్డి తెలిపారు. నిందితుడు నుంచి 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రైవర్​గా పనిచేస్తున్న చిలకలూరికపేటకు చెందిన నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇక్కడ దొంగిలించిన వాహనాలను తెలంగాణ రాష్ట్రంలో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.

గుంటూరు జిల్లా తుమ్మల చెరువు టోల్​ గేట్​ వద్ద తనిఖీలు చెపట్టిన పిడుగురాళ్ల పోలీసులు మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే తెలంగాణా రాష్ట్రం నుంచి పొందుగల చెక్ పోస్టు ద్వారా రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు నుంచి 3,64,000 రూపాయలు విలువ చేసే 2118 తెలంగాణ మద్యం బాటిళ్లను సీజ్​ చేశామన్నారు.

వీరిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందినవారుగా గుర్తించినట్లు తెలిపారు. త్వరలోనే పరారీలో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. నిందితుల అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ కె ప్రభాకర్ రావు, ఎస్ఐ పవన్ కుమార్, సిబ్బంది వెంకటేశ్వరరావు, షేక్ అలీ సాహెబ్, షేక్ నాగుర్ వలిలను డీఎస్పీ అభినందించారు.

ఇవీ చూడండి...

'దొంగతనాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.