గుంటూరులో ప్రభుత్వ స్థలాల అమ్మకాన్ని నిరసిస్తూ తెదేపా, వామపక్షాలు చేపట్టిన ఆందోళనలు పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్, కార్మిక శాఖ స్థలం, నల్లపాడులోని స్థలాల్ని ప్రభుత్వం వేలం వేసేందుకు నిర్ణయించింది. దీన్ని నిరసిస్తూ విపక్షాలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మార్కెట్ వద్ద ఆందోళన చేసేందుకు తెదేపా, వామపక్షాల నేతలు ప్రయత్నించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ వద్దకు వెళ్లారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి లాలపేట స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: తెరిచేందుకు అనుమతివ్వండి... హైకోర్టును ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్