ETV Bharat / state

మేడికొండూరు సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు వేగవంతం

గుంటూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన.. మేడికొండూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న పోలీసులు ఎనిమిది బృందాలను రంగంలోకి దించారు.

rape
అత్యాచారం
author img

By

Published : Sep 14, 2021, 11:53 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసును ఛేదించడం కోసం ఎనిమిది బృందాలను రంగంలోకి దించారు. ఈ దురాగతానికి సమీప ప్రాంతాలకు చెందినవారే పాల్గొని ఉండొచ్చని తొలినుంచీ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇప్పటివరకు 50 మందికిపైగా యువకులను విచారించారు. వీరులో అనేక మందికి నేరచరిత్ర ఉండడంతో వారిపైనే దృష్టి సేకరించి విచారణ చేస్తున్నారు.

ఘటన జరిగిన ప్రదేశానికి..సమీపంలోని గ్రామానికి చెందిన పలువురు యువకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరు పాత నేరస్థులు ఉన్నారు. వారు ఆ రోజున ఆ ప్రాంతంలో తిరిగారని..కాల్ డేటా సైతం సేకరించినట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న యువకుల్లో ఒకరిద్దరు ఈ నేరానికి పాల్పడ్డారని ఒప్పుకున్నారని..ఐతే ఆ రోజు బాధితురాలి నుంచి దోచుకెళ్లిన బంగారు ఆభరణాలు ఎక్కడ ఉంచారో చెప్పడం లేదని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.