గుంటూరులోని నల్లపాడు వద్ద అనసూయాంబనగర్ కాలనీవాసులు.. నరసరావుపేట, సత్తెనపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. తమ ఇంటి స్థలాలను వేరేవాళ్లకు కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఈ ప్లాట్లను కొన్నామని.. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఈ ప్లాట్లను 30ఏళ్ల క్రితం కొనుక్కున్నాం. కొందరు ఇళ్లు నిర్మించుకోని ఇంటిపన్నులు, కరెంటు బిల్లులు కూడా కడుతున్నారు. అయితే తాజాగా వేరేవాళ్లకు ఈ స్థలాలను మార్పిడి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు.. ఈ స్థలాల హక్కుపత్రాల గురించి ఎలాంటి విచారణ చేపట్టకుండానే కొందరికి ఆన్లైన్లో 1బీ, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి. - బాధితులు
ఇదీ చూడండి: