విశాఖ విషవాయువు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా బాధ్యులు డాక్టర్ అరవింద బాబు డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై స్పందించిన ఆయన... అమాయకులు, అభంశుభం తెలియని చిన్నారులు నిద్రలోనే మృతిచెందడం బాధ కలిగించిందన్నారు.
ఘటలో మృతిచెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొచ్చి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.